IPL Re-Start: ఫ్రాంచైజీలు రీప్లేస్ చేసిన ప్లేయర్లు వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) పాక్‌-భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం(IPL Restart) కానుంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌ను 6 న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని BCCI నిర్ణ‌యించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వ‌ర‌కు లీగ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం 29 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు మొద‌లు కానున్నాయి. ఇక‌, జూన్ 3న ఫైనల్(Final Match) జరగనుంది.

3 players who could be a replacement player in IPL 2024 if there is no  mega-auction before IPL 2025

అయితే, లీగ్‌ వారం పాటు వాయిదా ప‌డ‌డంతో కొంత‌మంది విదేశీ ఆట‌గాళ్లు(Foreign players) వారి దేశాల‌కు వెళ్లిపోయారు. వారిలో కొంద‌రు తిరిగి భార‌త్‌కు వ‌చ్చేందుకు సుముఖ‌త చూపించ‌లేదు. అలాగే కొంత‌మంది ప్లేయ‌ర్లు గాయాల కార‌ణంగా జ‌ట్ల‌కు దూర‌మ‌య్యారు. దాంతో వారి స్థానాల్లో ఫ్రాంచైజీలు(Franchises) కొత్త ఆట‌గాళ్ల‌ను తీసుకున్నాయి. మరి కొత్తగా చేరిన ప్లేయర్లు ఎవరో చూద్దామా..

Top Players Who Could Replace Kagiso Rabada in IPL 2025 for Gujarat Titans

ఈ జట్టలో చేరిన కొత్త ప్లేయర్లు వీరే..

☛ PBKS: తొడ కండరాల గాయంతో జట్టుకు దూర‌మైన‌ లాకీ ఫెర్గూసన్ స్థానంలో కైల్ జామిసన్‌ను జట్టులోకి తీసుకుంది. వేలి గాయంతో దూరమైన ఆల్‌రౌండ‌ర్‌ గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్ జట్టులోకి వచ్చాడు.
☛ MI: వెస్టిండీస్‌తో సిరీస్ కోసం స్వ‌దేశానికి వెళ్లిన ఇంగ్లండ్ ఆట‌గాడు విల్ జాక్స్ స్థానంలో జానీ బెయిర్‌స్టోను రీప్లేస్ చేసింది. అలాగే జాతీయ జ‌ట్టుకు ఆడేందుకు వెళ్లిపోయిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ర్యాన్ రికెల్టన్ స్థానంలో రిచర్డ్ గ్లీసన్ వచ్చాడు.
☛ DC: వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన స్టార్ బౌల‌ర్‌ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకుంది.
☛ GT: వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం స్వ‌దేశానికి వెళ్లిన జోస్ బట్లర్ స్థానంలో కుశాల్ మెండిస్ జట్టులోకి వచ్చాడు.
☛ LSG: వెన్నునొప్పితో జట్టుకు దూరమైన స్టార్ పేస‌ర్‌ మయాంక్ యాదవ్ స్థానంలో విలియం ఓరూర్కీ జట్టులోకి చేరాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *