UPI Transactions: యూవీఐలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. మరి ఈ కొత్త రూల్ తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు(Cashless Transactions) గణనీయంగా పెరిగిన నేపథ్యంలో యూపీఐ యాప్‌(UPI Apps)ల వినియోగదారుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ముఖ్యంగా, తమ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు(Bank Account Balance) ఉందో తెలుసుకోవడానికి చాలామంది తరచూ UPI యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల బ్యాంకు శాఖకు గానీ, ATM కేంద్రానికి గానీ వెళ్లాల్సిన అవసరం తప్పుతోంది. అయితే, ఇలా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని కొత్త నిబంధనలు(Rules) తీసుకురానుంది. ఈ మేరకు బ్యాంకులకు, యూపీఐ సేవల సంస్థలకు ఇప్పటికే నోటిఫికేషన్(Notification) జారీ చేసింది.

आप भी दिन में कई बार चेक करते हैं अकाउंट बैलेंस तो छोड़ दीजिए आदत, 1 तारीख  से बदल रहा नियम

గరిష్ఠంగా రోజుకు 50 సార్లు మాత్రమే..

NPCI కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఒక UPI App ద్వారా గరిష్ఠంగా రోజుకు 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ ఖాతాలోని నిల్వను పరిశీలించుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ వినియోగదారులు(Customers) రెండు వేర్వేరు యూపీఐ యాప్‌లు వాడుతున్నట్లయితే, ప్రతి యాప్‌లోనూ రోజుకు 50 సార్లు చొప్పున బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. యూపీఐ నెట్‌వర్క్‌(UPI Network)పై అధిక భారం పడకుండా చూడటం, తద్వారా లావాదేవీల వేగాన్ని, సేవల నాణ్యతను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని NPCI వర్గాలు తెలిపాయి. కాగా ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *