మరో టైటిల్ పోరుకు ఇండియా ఉమెన్స్, ఇంగ్లండ్ మహిళల జట్లు రెడీ అయ్యాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంగ్లండ్‌లోని చెస్టర్-లే-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ మైదానంలో సాయంత్రం 5.30 గంటలకు మూడో వన్డే ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.మొదటి మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది, రెండవ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లతో (DLS పద్ధతి) విజయం సాధించింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ ఇరుజట్లకు అత్యంత కీలకం కానుంది.
.jpg?type=mq)
హోరాహోరి పోరు తప్పదా?
ఇప్పటికే ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ నెగ్గిన హర్మన్ సేన వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలని చూస్తోంది. అటు ఎలాగైన ఈ సిరీస్‌ను కోల్పోవద్దని ఇంగ్లిష్ టీమ్ భావిస్తోంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ ఉత్కంఠగా జరిగే అవకాశం ఉంది. కాగా భారత్ తమ బ్యాటింగ్ లైనప్‌లో స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kour) వంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. అటు బౌలింగ్‌లోనూ దీప్తిశర్మ, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్ జట్టు నాట్ స్కివర్-బ్రంట్(Nat Sciver-Brunt) నాయకత్వంలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ వంటి బౌలర్లతో పటిష్ఠంగా కనిపిస్తోంది.

1-1తో సమం చేసిన ఇంగ్లండ్
సౌతాంప్టన్(Southampton)లో జరిగిన తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. దీప్తి శర్మ (62* రన్స్) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్ (48 రన్స్)తో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం భారత్ విజయంలో కీలకంగా నిలిచారు. ఇక వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన రెండో వన్డేలో DLS పద్ధతిలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ జట్టులో సోఫీ ఎక్లెస్టోన్ (3/27) రాణించడంతో భారత్ కేవలం 143/8కి పరిమితం అయింది. ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్ ఎమీ జోన్స్ (46*), బ్యూమౌంట్ (34) రన్స్‌తో ఆతిథ్య జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
IND-W vs ENG-W Match Prediction by E2bet,3rd ODI Match Details – Who will win today’s match?#Cricket #INDWvsENGW #MatchPrediction #CricketTwitter #CricketLegends #cricketprediction #cricketbetting #INDvsENG2025 #ShahRukhKhan #SaiyaaraReview https://t.co/68gvLHA1Qv
— Sports Record & Stats (@binodbhai0123) July 21, 2025






