డైనమిక్ హీరో విష్ణు మంచు(Manchu Vishnu) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప(Kannappa)’. ఈ మూవీపై అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు(Songs), టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్(Third Single) అప్డేట్ వచ్చింది. ‘మహాదేవ శాస్త్రి పరిచయ’ గీతాన్ని బుధవారం (మార్చి 19) సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohanbabu Birthday) పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను కూడా పోషించారు. దీంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు.
కీలక పాత్రల్లో స్టార్ నటులు
మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal), ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ(Stephen Devassi) స్వరపరిచిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియా(SM)లో దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా మహాదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు.

ఆ లవ్ సాంగ్‌పై విమర్శలు
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కించారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాగా ‘కన్నప్ప’ సినిమా నుంచి ఇటీవలే లవ్ సాంగ్ అంటూ ‘సగమై చెరి సగమై’ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. వినడానికి, పిక్చరైజేషన్ అంతా అద్భుతంగా అనిపించింది. అయితే భక్తి సినిమాలో ఇలాంటి గ్లామర్ సాంగ్ ఏంటబ్బా అంటూ నెటిజన్లు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది ఈ సినిమా భక్తి సినిమా కదా అంటూ ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.






