ఒకప్పుడు టిక్‌టాక్(Tik Tok) ద్వారా ఎంతోమంది టాలెంట్ బయటపడింది. ప్రస్తుంతం సినిమాల్లో నటిస్తున్న ఎంతో మంది స్టార్ లు కూడా ఒకప్పుడు టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయినా వారే. ఇప్పుడు ఈ ఫొటోలో సమంత(Samantha) పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు టిక్ టాక్ స్టారే. తన లిప్ కిసింగ్ వీడియోలు, రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, టిక్‌టాక్ బ్యాన్ అయ్యేలోపు నెట్టింట స్టార్‌గా మారిపోయింది. అంతేకాకుండా, అదే క్రేజ్‌తో సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా.. తన పేరు ప్రణవి మానుకొండ(Pranavi Manukonda).
హైదరాబాద్‌లో జన్మించిన ప్రణవి, చాలా చిన్న వయసులోనే వెండితెరపై కనిపించింది. 11 ఏళ్లకే సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ గర్ల్, ‘ఉయ్యాలా జంపాలా’, ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి పాపులర్ సినిమాల్లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), రాజ్ తరుణ్(Raj Tharun) లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి, ఒక సినిమాలో తన చైల్డ్ పెర్ఫార్మెన్స్‌కి నంది అవార్డు కూడా గెలుచుకుంది.
సినిమాలకే కాకుండా టీవీ రంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రణవి. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి పాపులర్ సీరియల్స్‌లోనూ నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చిన్నతనంలోనే నటనలో తన ప్రతిభ చూపించినా, హీరోయిన్‌గా మాత్రం ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
View this post on Instagram






