ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్లలో ఒకరు. సినీ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ, చిన్నతనంలో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో మనం తెలుసుకుందాం.
ఈ అమ్మాయి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor). 1980లో జన్మించిన కరీనా కపూర్ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2000లో ‘రెఫ్యూజీ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అశోక, భజరంగీ భాయిజాన్, జబ వి మెట్, తలాష్, సింగమ్ రిటర్న్స్, వీర్ ఝారా వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు.. స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కరీనా నివసిస్తున్న ముంబై ఇంటి విలువ దాదాపు రూ.800 కోట్లు. ఒక్కో సినిమాకు రూ.10–12 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటోంది.
View this post on Instagram
తండ్రి రణధీర్ కపూర్(Ranadheer Kapoor) మాట్లాడుతూ – “నా ఇద్దరు కుమార్తెలకు స్కూల్ ఫీజు చెల్లించడంలోనూ ఇబ్బంది పడ్డాను” అని వెల్లడించారు. కరీనా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – “మేము పెద్ద సినిమా కుటుంబానికి చెందినవాళ్లమే అయినా, ఒక దశలో పేదరికాన్ని ఎదుర్కొన్నాం. నా అక్క కరిష్మా(Karishma Kapoor) రోజూ రైళ్లు, బస్సుల్లో కాలేజీకి వెళ్లేవాళ్లు. ఆర్థికంగా ఎంతో కష్టం అనుభవించాం,” అని చెప్పింది.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్(Sife Ali Khan)ను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. వివాహానంతరం కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ వెండితెరపై తన హవాను చూపిస్తోంది.






