స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా నిడివి 5 గంటలకు పైగా ఉందని, దాన్ని కుదించి 2.45 గంటలకు చేయడం వల్ల అనుకున్న అవుట్ ఫుట్ బయటకు రాలేకపోయిందని అన్నారు. తాను తీసిన సినిమాపై స్వయంగా విమర్శలు చేయడం పట్ల అందరూ నోరెళ్ల బెట్టారు.
ఏడు గంటల నిడివితో..
ప్రస్తుతం ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన షమీర్ (Editor Shamir) సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ నిడివి ఏకంగా 7 గంటలు ఉందన్నారు. డైరెక్టర్ శంకర్ తో పని చేయడం తనకు అంత పెద్ద అనుభూతిని కలిగించలేదని చెప్పాడు. గేమ్ ఛేంజర్ మూవీకి తాను కొంతకాలం పని చేశానని అప్పుడు ఆ సినిమా ఏకంగా ఏడున్నర గంటలపైనే ఉందన్నారు.దాన్ని నేను మూడు గంటల వరకు ఎడిట్ చేయగలిగానని అన్నాడు. కానీ అది నాకు పెద్ద హ్యాపీగా అనిపించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం షమీర్ చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారాయి. దీంతో రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఏడు గంటలు సినిమా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. షమీర్ పక్కకు తప్పుకున్నాక ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను ఆంటోనీ రూబెన్ తీసుకున్నారు.
మలయాళంలో మూవీలకు..
గేమ్ ఛేంజర్ లో ద్విపాత్రాభినయంతో రామ్ చరణ్ (Ram Charan) ఆకట్టుకోగా.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళంలో అనేక మూవీలకు ఎడిటర్ గా వర్క్ చేసిన షమీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.






