ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) పలు రికార్డులు తిరగరాసింది. T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న మ్యాచుగా RCB vs PBKS మధ్య సాగిన ఐపీఎల్ ఫైనల్(IPL Final 2025) మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌కు TV, డిజిటల్ ప్లాట్‌పామ్స్‌లో కలిపి ఏకంగా 31.7 బిలియన్ల వీక్షణలు వచ్చినట్లు సమాచారం. ఫైనల్‌ను TVలో 169 మిలియన్ల మంది వీక్షించగా.. డిజిటల్‌లో 892 మిలియన్ వీడియో వ్యూస్‌తో కొత్త బెంచ్‌మార్క్‌ను నమోదు చేసింది. మ్యాచ్‌ను ఒకదశలో అత్యధికంగా 55 మిలియన్ల మంది వీక్షించారు. కాగా ఫైనల్లో పంజాబ్‌పై ఆర్సీబీ 6 రన్స్ తేడాతో నెగ్గి తొలిసారి టైటిల్‌ని ముద్దాడింది.
OVER 1 BILLION PEOPLE TUNED IN TO WATCH THE IPL 2025
– 840 Billion minutes watch time in IPL 2025 as the Most Watch IPL Ever and Final is the Most watched T20 game in History with his 37.1 Billion minutes watch time 🥶#ShubmanGill #YashasviJasiwal #ViratKohli #KLRahul #RCB pic.twitter.com/ExXYXGyB5u
— Monish (@Monish09cric) June 19, 2025
గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం అధికం
గత సంవత్సరంతో పోలిస్తే డిజిటల్ వీక్షణల్లో జియోస్టార్(JioHotstar) 29 శాతం పెరుగుదలను నమోదుచేసింది. ఎక్కువ మంది అభిమానులు పెద్ద స్క్రీన్లలో మ్యాచ్‌లను చూడటానికి ఆసక్తి చూపించారు. టీవీలో స్టార్ స్పోర్ట్స్ 456 బిలియన్ నిమిషాల లైవ్ కవరేజీని అందించింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. కాగా ఈ సీజన్‌లో టీవీ, డిజిటల్ ప్లాట్‌పామ్స్‌లో కలిపి మొత్తం మ్యాచ్‌లకు 840 బిలియన్ల నిమిషాల వీక్షణలు వచ్చాయని ప్రసారదారు జియోస్టార్ ప్రకటించింది.
రికార్డులు ఇలా..
– ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించబడిన IPL 2025 ఇదే.
– ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించబడిన ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ T20 గేమ్.
– 840 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం.
– JioHotstarలో 384.6 బిలియన్ నిమిషాలు.
– స్టార్ స్పోర్ట్స్(Star Sports)లో 456 బిలియన్ నిమిషాలు.
– టీవీలో ఫైనల్‌లో 169 మిలియన్ వీక్షకులు.
– ఫైనల్‌లో 892 మిలియన్ వీక్షణలు.
– JioHotstarలో ఫైనల్‌లో 16.74 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం.
– స్టార్ స్పోర్ట్స్‌లో ఫైనల్‌లో 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం.
– ఈ IPLలో JioHotstarలో 23 బిలియన్ వీక్షణలు.
🚨 HISTORY MADE IN IPL 2025 🚨
– Most Watched IPL Ever.
– Final is Most Watched T20 game Ever.
– 840 Billion Minutes watch time.
– 384.6 Billion minutes on JioHotstar.
– 456 Billion minutes on Star Sports.
– 169 million viewers in Final on TV.
– 892 Million Views in Final.
-… pic.twitter.com/xo21TaOli6— Tanuj (@ImTanujSingh) June 19, 2025






