పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) లీడ్ రోల్‌లో నటించిన హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) మూవీ టికెట్ల ధరలు(Ticket Rates) తెలంగాణలో పెరిగాయి. ఈ మేరకు జీవో జారీ చేసింది. దీంతో తెలంగాణ(Telangana)లో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్(Multiplex)లలో ధరలు పెంపు ఒక్కోలా ఉంది. ఇక స్పెషల్ ప్రీమియర్ షో(Special premiere shows)లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక రోజు ముందే ఈ షోలు ఉండనున్నాయి. జులై 23న రాత్రి 9 గంటలకు నిర్వహించే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600+GSTగా నిర్ణయించారు. జులై 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను రూ.200+GST, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150+GST వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.150+GST, సింగిల్ స్క్రీన్‌లలో రూ.106+GST పెంపు ఉంటుంది.

ఏపీలో 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపు
ఇప్పటికే ఏపీ(Andhra Pradesh)లోనూ ప్రభుత్వం 10 రోజులు (జులై 24 నుంచి ఆగస్టు 2 వరకూ) అనుమతించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సింగిల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ టికెట్ ధర రూ.297, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.377గా ఉండనుంది. అదనంగా, జులై 23న రాత్రి 9 గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్ షో(Premiere shows)లకూ అనుమతి ఇవ్వగా, ఈ టికెట్ ధర రూ.600 (GSTతో)గా నిర్ణయించారు.
గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్
కాగా క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతికృష్ణ దర్శకత్వంలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందింది. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే విడుదలై, భారీ అంచనాలను రేకెత్తించాయి. ప్రమోషన్స్‌లో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
🔥 #HariHaraVeeraMallu Ticket Price Hike G.O. out!
🎟️ 9 PM Premieres cleared at ₹600/- 💥
Massive openings loading… get ready! 🦅#HHVMonJuly24th pic.twitter.com/stDgiv0mq9
— TFI Sena 🎥⚔️ (@tfi_sena) July 19, 2025






