ManaEnadu:సొంతగడ్డపై తమను ఓడించేవారే లేరన్నట్లు గొప్పలకు పోయిన టీమ్ఇండియా(Team India) బొక్కబోర్లా పడింది. అతివిశ్వాసం(overconfidence)తో న్యూజిలాండ్(New Zealand)తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్(0-3)కు గురైంది. వెరసీ సగటు క్రికెట్ అభిమాని నుంచి తీవ్ర ఆగ్రహం, విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సిరీస్‌లో భారత్ బౌలింగ్‌లో ఫరవాలేదనిపించినా.. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. జట్టును ముందుండి నడపాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) పూర్తిగా విఫలమయ్యాడు. పరుగులు సాధించేందుకు నానా తంటాలు పడ్డాడు. మొన్నటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(World Test Championship) పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్.. ఆ మెగా ఫైనల్ చేరాలంటే ఇక అద్భుతమే జరగాలి.
ఐదింటిలో నాలుగు నెగ్గాలి.. ఒకటి డ్రా చేయాలి
డబ్ల్యూటీసీ(WTC) పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో మొదటి స్థానానికి చేరింది. అదే సమయంలో భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో శ్రీలంక (55.56) శాతంతో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగో స్థానినిక చేరింది. ఆ తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా 54.17 శాతంతో కొనసాగుతోంది. ఇక ఈ టోర్నీలో భారత్‌కు సవాల్ ఎదురుకానుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో ఆసీస్‌తో 5 టెస్టుల్లో తలపడనుంది. WTC సైకిల్‌లో భారత్‌కు ఇదే ఆఖరి సిరీస్.

24 ఏళ్ల తర్వాత వైట్ వాష్
ఈ సిరీస్‌లో కనీసం 4 టెస్టుల్లో రోహిత్ సేన గెలవాలి. అలాగే మరొక దానికి డ్రాగా ముగించాలి. ఈ సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ ఓడినా.. ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా స్వదేశంలో 3-0 తేడాతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఎప్పుడూ వదులుకోలేదు. ఇలా దాదాపు 24 ఏళ్ల తర్వాత భారత జట్టు స్వదేశంలో వైట్ వాష్‌కు గురికావడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.








