
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి (tirumala ratha saptami 2025) నిర్వహించనున్నారు. ఈ రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.
ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవ (tirumala ratha saptami Vahana Seva)తో రథసప్తమి వేడుకలు ప్రారంభమై.. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో వాహన సేవలు ముగుస్తాయి. రథసప్తమి సందర్భంగా టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు.
శ్రీవారి వాహనసేవల వివరాలు..
- ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు – సూర్యప్రభ వాహన సేవ
- ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహన సేవ
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహన సేవ
- మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహన సేవ
- మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
- సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహన సేవ
- సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహన సేవ
- రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనసేవ
అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు, ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని స్పష్టం చేసింది.