
బంగారం ధరలు (gold rates) వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన వెండి ధరలు (silver rates today) కూడా ఈరోజు తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 6.40 గంటల నాటికి హైదరాబాద్ (Gold rate in Hyderabad today), విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.160 తగ్గి రూ.97,470కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.160 పడిపోయి రూ. 89,340కి చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.160 తగ్గి రూ.97,620కి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.89,490గా ఉంది.
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గిపోయి రూ.99,900కు చేరుకుంది. ముంబై, బెంగళూరు, పుణే, లక్నో, పాట్నా, సూరత్, అయోధ్య ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడలో కూడా కేజీ వెండి రేటు 200 రూపాయలు పడిపోయి రూ.1,10,900కి చేరింది. అయితే చెన్నై, మధురై, పాండిచ్చేరి, త్రివేండ్రం ప్రాంతాల్లో మాత్రం వెండి ధరలు రూ.100 పెరిగి రూ.1,11,200 స్థాయికి చేరుకున్నాయి.