
మన దేశంలో మనీ కూడా లేని వ్యాల్యూ గోల్డ్(Gold)కు ఉంటుందనేది కాదనలేని నిజం. ఎందుకంటే భారత సంస్కృతి, సంప్రదాయాల్లో పుత్తడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ ఫెస్టివల్(Festival) అయినా, ఏ స్పెషల్ అకేషన్ అయినా మహిళలకు బంగారు ఆభరణాలు ధరించేందుకే మొగ్గుచూపుతారు. మరోవైపు ఇటీవల కాలంలో పురుషులు కూడా బంగారం ధరిస్తున్నారు. ధర(Price) ఎంత పెరుగుతున్నా.. దానికున్న డిమాండ్(Gold Demand) మాత్రం తగ్గడం లేదు. తోటివారికి 10 తులాలు ఉన్నా మాకు కనీసం 2 తులాలైనా ఉండొద్దా అని సాధారణ మధ్యతరగతి మహిళలు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఫిబ్రవరి నుంచి శుభమూహూర్తాల సీజన్(Season of Auspiciousness) మొదలుకానుంది. ఇకపై బంగారం రేట్లు మరింత పైపైకి వెళ్లేలా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇటు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States)నూ బంగారం రేట్లు భగభగమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్(Hyd)లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గత రెండు రోజుల్లోనే రూ.1000 మేర పెరిగింది. ఇవాళ (Jan 31) ప్రస్తుతం తులం బంగారం రేటు రూ.76,110 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి రూ.83,030గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.1,06,100వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనుండగా.. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
అంతర్జాతీయంగానూ రేట్ల దడదడ
ఇక గత మూడురోజులుగా పెరుగుతూనే వస్తున్న గోల్డ్ రేట్స్(Gold Rates) ఇవాళ కూడా అదే ఊపులో హైక్ అయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2797 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి సైతం తానేం తక్కువ కాదన్నట్లు ఔన్సుకు 31.57 డాలర్ల(Dollar) వద్ద కదలాడుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపీ వ్యాల్యూ(Rupee Value) రూ.86.63వద్ద కొనసాగుతోంది.