
నితిన్(Nitin) హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు(Thammudu). తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. ఇవాళ్టి (ఆగస్టు 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్(Streaming on OTT)కు అవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్(Director Venu Sriram) దర్శకత్వం వహించారు. MCA, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన వేణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావించారు. కానీ ఈ మూవీ ఆయనకు భారీ నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో లయ(Laya), సప్తమి గౌడ(Saptami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), శ్వాసిక విజయ్, సౌరభ్ సచ్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీ జులై 4న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
అక్కా-తమ్ముడి సెంటిమెంట్(Brother-sister sentiment)తో రూపొందిన ఈ చిత్రంలో నితిన్, లయ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్(Boxoffice) వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. డిజాస్టర్ టాక్‌తో కనీస కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయిన ఈ మూవీ, నితిన్ ఖాతాలో మరో ఫ్లాఫ్‌ను అందించింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్(Netflix) ఈ చిత్రం ఓటీటీ హక్కులను సొంతం చేసుకొని, ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్‌కు చేస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అజనీష్ లోక్‌నాథ్(Ajanish Loknath) మ్యూజిక్ అందించిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఓటీటీలో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓటీటీలో ఈ మూవీ చేసేయండి..
Thana lakshyanni, akkani thirigi thevadaniki ee thammudu is on a mission!
Watch Thammudu on Netflix, out 1 August in Telugu, Tamil, Malayalam and Kannada.#ThammuduOnNetflix pic.twitter.com/5mAUQ9GXwY— Netflix India South (@Netflix_INSouth) July 27, 2025