Samantha : ఎక్స్‌లోకి సమంత రీ ఎంట్రీ.. ఫస్ట్‌ పోస్ట్‌ ఏం పెట్టిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అప్డేట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తనకు బాధొచ్చినా.. ఆనందం వచ్చినా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అప్పుడప్పుడు మోటివేట్ చేసే కోట్స్, పోస్టులు పెట్టి అభిమానుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంటుంది. ఈ మధ్య హెల్త్ పాడ్ కాస్ట్ చేస్తూ నెటిజన్లకు ఆరోగ్యంపై పలు టిప్స్ కూడా ఇస్తోంది. అయితే సామ్ ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది.

ట్విటర్ పోస్టులు డిలీట్

2012లో ఎక్స్‌లో (అప్పట్లో ట్విటర్‌) ప్రొఫైల్‌ ఓపెన్ చేసిన సామ్ గత కొంతకాలం క్రితం ఇందులోని తన పోస్టులన్నీ డిలీట్ చేసింది. అప్పటి నుంచి ఎక్స్ ను వదిలేసి.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో యాక్టివ్‌గా ఉంటోంది. అయితే తాజాగా సామ్‌ ఎక్స్‌లోనూ రీఎంట్రీ ఇచ్చింది. సోమవారం రోజున తన అకౌంట్ ను రీ యాక్టివేట్ చేసి ఓ పోస్టును షేర్ చేసింది. మరి ఎక్స్ (Samantha X Account)లో రీ ఎంట్రీ తర్వాత సామ్ షేర్ చేసిన తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా..? అదేంటంటే..?

ఎక్స్ లో తొలి పోస్టు ఇదే

సమంత ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Productions)’ అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సామ్ తన నిర్మాణ సంస్థ నుంచి ఇటీవలే తొలి సినిమా ప్రకటించింది.  ‘శుభం (Subham)’ అనే టైటిల్ తో ఇటీవలే ఓ సినిమా ప్రకటించి ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా గురించి తెలుపుతూ సమంత తన ఎక్స్‌లో సోమవారం పోస్ట్‌ పెట్టింది. ‘పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం. గొప్ప ప్రారంభం’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంతను ఎక్స్‌లో 10.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *