Mahesh Vitta: టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టాకి తండ్రిగా ప్రమోషన్

టాలీవుడ్ కమెడియన్(Tollywood comedian), బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా(Mahesh Vitta) ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఆయన తండ్రి(Father)గా ప్రమోషన్ లభించింది. మహేశ్ భార్య శ్రావణి రెడ్డి(Shravani Reddy) తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను మహేశ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన బిడ్డ చేతులను పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ “డర్టీ డైపర్స్, నిద్రలేని రాత్రులు ప్రారంభమయ్యాయి” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

యూట్యూబ్‌లో ఫన్ బకెట్ వీడియోలతో గుర్తింపు

కాగామహేశ్ విట్టా యూట్యూబ్‌లో ‘ఫన్ బకెట్(Fun Bucket)’ వీడియోలతో గుర్తింపు పొందారు. రాయలసీమ యాసలో డైలాగులతో అభిమానులను ఆకట్టుకున్న ఆయన, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘కొండపొలం(Kondapolam)’, ‘జాంబీరెడ్డి’ వంటి సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించారు. బిగ్ బాస్(Bigg Boss-3), OTT సీజన్‌లలో పాల్గొని ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లోనే తన ప్రేమ కథను బయటపెట్టిన మహేశ్, 2023లో శ్రావణి రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ ఐదేళ్లపాటు సాగి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కాగా మహేశ్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తూనే ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంతోషకరమైన సమయంలో అభిమానులు మహేశ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *