Mana Enadu : ఈ ఏడాది 2024 డిసెంబరు నెల వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో 2025 కొత్త ఏడాది వచ్చేస్తోంది. ఈ ఏడాది ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు (Tollywood Movies) రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అయితే 2024లో ఏ ప్రాజెక్టు చేయకపోయినా.. 2025లో మాత్రం డబుల్ ధమాకాతో వస్తామంటూ చెబుతున్నారు. ఆ హీరోలు ఎవరంటే.. ?
డబుల్ ధమాకాతో 2025
టాలీవుడ్ యంగ్ హీరోలు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), నితిన్, సాయి దుర్గా తేజ్, అడివి శేష్ (Adivi Sesh).. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేకుండానే 2024కు గుడ్ బై చెప్పనున్నారు. అలాగనీ ఈ ఇయర్ వీళ్లేం ఖాళీగా లేరు. ఇతర ప్రాజెక్టు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. గతేడాది కస్టడీతో పలకరించిన నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్ (Thandel)’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు కార్తీక్ దండు డైరెక్షన్లో ఇంకో ప్రాజెక్టు కూడా ఓకే అయింది. ఇది కూడా 2025లో రానుంది.
2025లో సందడే సందడి
ఇక మరో యంగ్ హీరో నితిన్ గతేడాది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’గా థియేటర్లలో సందడి చేశాడు. ‘రాబిన్ హుడ్ (Robinhood)’ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉన్నా.. అది పోస్టు పోన్ అయింది. ఇక వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే కాకుండా శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తమ్ముడు, వేణు యెల్దండితో ‘ఎల్లమ్మ’ చిత్రాలు చేయనున్నారు. ఇవన్నీ 2025లో రానున్నాయి. మేజర్, హిట్-2 చిత్రాలతో సూపర్ హిట్ కొట్టిన అడివి శేష్.. గూఢచారికి సీక్వెల్‌గా జి2, ‘Decoit: ఎ లవ్‌స్టోరీ’తో 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
వచ్చే ఏడాదిలో సినిమాల జాతర
మరోవైపు గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) నుంచి ఈ ఏడాది ఒక్క మూవీ కూడా రాలేదు. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్.. కె.పి.రోహిత్ దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’ వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్, నాగ శౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అఖిల్ అక్కినేని, వైష్ణవ్ తేజ్ నుంచి కూడా ఈ ఏడాది ఒక్క ప్రాజెక్టు రాలేదు. వచ్చే ఏడాది వీరి నుంచి సినిమాలు రానున్నాయి.






