మన ఈనాడు:రకుల్ థాయ్లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీతో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి మంచు లక్ష్మి , ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు
ఇంతకీ రకుల్ పెళ్లి చేసుకునేది ఎవర్నో కాదు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ని. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని రకుల్ తెలిపింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ ని ప్రకటించారు. ఈ నెలలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే రకుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది.
ఈ క్రమంలోనే రకుల్ థాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీతో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి మంచు లక్ష్మి (Manchu Laxmi) , ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal) హాజరయ్యారు. రకుల్ మంచు లక్ష్మి మంచి స్నేహితులన్న విషయం టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే.