సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఆగస్టు 9న ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) కానుంది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం, మహేష్ బాబు కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. జయభేరి ఆర్ట్స్(Jayabheri Arts) బ్యానర్‌పై నిర్మాత మురళీమోహన్(Murali Mohan) రూపొందించిన ‘అతడు’, అప్పట్లో థియేటర్‌లలో పెద్దగా ఆడకపోయినా, టెలివిజన్‌లో రికార్డు టీఆర్పీ రేటింగ్‌లతో అభిమానుల మనసు గెలుచుకుంది. మహేష్ బాబు స్టైలిష్ లుక్, త్రిష(Trisha)తో కెమిస్ట్రీ, త్రివిక్రమ్ సంభాషణలు, మణిశర్మ సంగీతం, బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.
4K వెర్షన్‌లోకి అప్‌డేట్
ఈ రీ-రిలీజ్ కోసం టెక్నాలజీ పరంగా మూవీని 4K వెర్షన్‌లోకి అప్‌డేట్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు జులై 30న మహేష్ బాబు యూట్యూబ్ ఛానల్‌లో రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా.. అభిమానుల్లో హైప్‌ను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘అతడు’లో మహేష్ నటనకు నంది అవార్డు లభించింది. కాగా ఈ మూవీపై ఇటీవల నిర్మాత, నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, మహేష్, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే ‘అతడు’ సీక్వెల్ తీసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులకు థియేటర్లలో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.
9 Days To Go for #Athadu4K 🔥
When guts and guns speak, the madness is sensational. Witness and celebrate #Athadu once again💥#AthaduSuper4K Grand Re-Release on August 9th🤩#Athadu4KOnAug9th
Super 🌟 @UrstrulyMahesh #Trivikram #MuraliMohan #Manisharma pic.twitter.com/zljOgaSTi6
— Team Mahesh Babu (@MBofficialTeam) July 31, 2025






