పుష్ప 2 సినిమా (puspa movie) విడుదలకు ముందు రోజు బెనిఫిట్ షోలకు ప్రేక్షకులు తండోపతండాలుగా తరలివచ్చారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో (sandya theater) పుష్ప 2 ప్రీమియర్ షో వేశారు. విషాదం చోటు చేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాట జరిగింది. సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ (allu arjun) వస్తున్నాడని తెలుసుకుని ప్రేక్షకులు భారీగా వచ్చారు. దీంతో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ క్రమంలో తొక్కిసలాట జరుగుతుం వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ (cpr) చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ దవాఖాన తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్ హాస్పిటల్‌కు (nims hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు.
పుష్ప-2 బెనిఫిట్ షోను చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా వారిలో తల్లి, కుమారుడు తొక్కిసలాటలో కిందపడిపోయారు. దీంతో తల్లి మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో బాలుడు శ్రీతేజ్ స్పృహ తప్పిపడిపోవడం కనిపిస్తుంది. పోలీసులు బాలుడిని తొక్కిసలాట నుంచి తీసుకువచ్చి సీపీఆర్ చేశారు. రష్మిక (rasmika) కూడా ఈ థియేటర్ కు సినిమా చూడటానికి వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ వద్ద చిన్న రోడ్లు ఉండటం.. అల్లు అర్జున్ (allu arjun) వస్తున్నాడని తెలుసుకుని ఆయన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడటంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రేక్షకులు సినిమా చూడటానికి రావాలని ఇలా అల్లరి చేసేందుకు వచ్చి ఒక నిండు ప్రాణం బలితీసుకున్నారని విమర్శిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ (pavan kalyan) సినిమా విడుదల సమయంలో విశాఖపట్నంలో కూడా కటౌట్లు కట్టే సమయంలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తో మరణించారు. వారి కుటుంబాల్లో విషాదం నెలకొనగా పవన్ కల్యాణ్ వెళ్లి ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి అండగా ఉంటానని హామీనిచ్చారు. అభిమానం ఉండాలి అది హద్దులు దాటకూడదని, విలువైన ప్రాణాల మీదకు తెచ్చుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.
A boy lost consciousness in a #stampede at the premiere show of #Pupshpa2 at RTC Cross Road #SandhyaTheater.. His condition is critical.#Hyderabad #Telangana pic.twitter.com/oN3Wn7vOSh
— BNN Channel (@Bavazir_network) December 4, 2024






