టాలీవుడ్ లో మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా వయోభారంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారు. చివరకు ఈరోజు (ఆగస్టు 30) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 ఏళ్లు.
కనకరత్నమ్మ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు నానమ్మ కాగా, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan)కు అమ్మమ్మ అవుతారు. ఈ విషయం తెలిసిన వెంటనే రామ్‌చరణ్ మైసూరు నుండి, అల్లు అర్జున్ ముంబై నుండి మధ్యాహ్నం కల్లా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నంగారి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్వయంగా చూసుకుంటున్నారు.
ఇకపోతే, నేడు విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ఉన్నందున పవన్ కళ్యాణ్(Pawan kalyan), నాగబాబు(nagababu) లు ఆదివారం హైదరాబాద్‌కి చేరుకుని అల్లు కుటుంబానికి సంతాపం తెలియజేసే అవకాశం ఉంది. కనకరత్నమ్మ మరణవార్త తెలిసిన బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.





