టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2(War-2)’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని పాత్రల చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. దీంతో ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఆడియెన్స్ ఓ రేంజ్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం కోసం కౌంట్ డౌన్(Count down) షురూ అయింది. ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఇవాళ్టి (జులై 14)తో సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంకా ఈ గ్యాప్ లో చాలానే అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి.

రొమాంటిక్ సాంగ్ వస్తుందని బజ్
అయితే ఈ అప్డేట్స్‌లో ట్రైలర్(Trailer) కంటే ముందు ఫస్ట్ సింగిల్(First SIngle) పట్ల కూడా మంచి ఆసక్తి నెలకొంది. అయితే వార్ 2 నుంచి ఫస్ట్ సింగిల్‌గా ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుందని బజ్ ఉంది కానీ ప్రస్తుతం ఈ సాంగ్ ఈ వారమే వస్తున్నట్టుగా వినిపిస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రీతమ్(Preetham) సంగీతం అందిస్తుండగా ఆల్రెడీ టీజర్‌కి తన వర్క్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. వరల్డ్ వైడ్ గా ఆగస్టు 14న తెలుగు, హిందీ తమిళ్ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకి రాబోతుంది.
First Banger from #War2 is loading..
Get Ready for the Dhamakedar BGM with mind blowing visuals in first song
This song surprise all
Biggest #Bollywood movie coming to disrupt all records
And Entertainment is full on🔥🔥#HrithikRoshan #JrNTR #YRF #War2OnAug14 pic.twitter.com/pLU3K2myg8
— Ashish Robinhood Pandey (@ashispandey1693) July 14, 2025
9 వేల థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్?
యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) డైరెక్ట్ చేశాడు. కియారా అద్వానీ(Kiara Advani) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అనిల్ కపూర్(Anil Kapoor), అషుతోష్ రాణా ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని 9 వేల థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయట.






