బాలీవుడ్ యువ నటులు జాన్వీ కపూర్(Janvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి(Param Sundari)’ ట్రైలర్ ఈరోజు (ఆగస్టు 12) విడుదలైంది. తుషార్ జలోటా(Tushar Jalota) దర్శకత్వంలో మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్(Dinesh Vision) నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్(Trailer) విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్లో జాన్వీ కపూర్ కేరళ అమ్మాయిగా, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ యువకుడిగా కనిపించారు. ఉత్తర, దక్షిణ భారత సంస్కృతుల మధ్య ప్రేమకథ(Lovestory)గా ఈ చిత్రం రూపొందింది. భాష, ఆచారాలలో భిన్నత్వంతో జరిగే వినోదభరిత సన్నివేశాలు, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ట్రైలర్‌ను ఆకట్టుకునేలా చేశాయి.

జాన్వీ-సిద్ధార్థ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్
జాన్వీ కపూర్ రజనీకాంత్(Rajinikanth), అల్లు అర్జున్(Allu Arjun), మోహన్‌లాల్‌లను ఇమిటేట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. కేరళలోని అందమైన లొకేషన్స్, విజువల్స్, జాన్వీ-సిద్ధార్థ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి.సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై ఉత్కంఠను పెంచింది. జాన్వీ కపూర్ ‘దేవర(Devara)’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై, ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘పెద్ది(Peddi)’లో నటిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌తోపాటు పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది.






