భక్తులకు అలర్ట్‌.. ఆ రెండ్రోజుల్లో శబరిమల స్పాట్ బుకింగ్స్‌పై లిమిట్!

Mana Enadu : శబరిమల అయ్యప్పను (Sabarimala Ayyappa) దర్శించుకునేందుకు అయ్యప్ప దీక్షాధారులతో పాటు సామాన్య భక్తజనం కూడా పోటెత్తుతున్నారు. దేశనలుమూలల నుంచి శబరిమలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న భక్తులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్ (TDB) కీలక అలర్ట్ జారీ చేసింది. ఈనెల 25, 26వ తేదీల్లో అయ్యప్ప ఆలయంలో వర్చువల్, స్పాట్‌ బుకింగ్‌లను పరిమితం చేయాలని నిర్ణయించింది. వార్షిక మండల పూజ కోసం వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

స్పాట్ బుకింగుపై లిమిట్

ఈ రెండ్రోజుల్లో 50వేలు, 60వేల మంది భక్తులు మాత్రమే దైవ దర్శనం చేసుకోవడానికి అనుమతించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ క్రమంలో ఈ రెండ్రోజుల్లో స్పాట్ బుకింగ్ (Sabarimala Spot Booking) కేవలం 50 వేల మందికి మాత్రమే పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 25వ తేదీన థంక అంకి ఊరేగింపు శబరిమల సన్నిధానానికి (ఆలయ సముదాయం) చేరుకోనుండటంతో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని.. అందువల్ల ఆరోజు 50,000 మంది యాత్రికులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించింది.

26న అయ్యప్ప స్వామి మండల పూజ

ఇక 26వ తేదీన పవిత్ర మండల పూజ (Sabarimala Ayyappa Mandala Puja) జరగనుండటంతో ఆ రోజు కూడా 60,000 మంది యాత్రికులను మాత్రమే కొండపై ఉన్న ఆలయంలోకి అనుమతించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.  పండగ రోజుల్లో భక్తుల రద్దీని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  వెల్లడించింది. మరోవైపు  అయ్యప్ప మండల పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనున్న విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *