హీరో ప్రభాస్(Prabhas), డైరెక్టర్ సందీప్ వంగా(Sandeep Vanga)కాంబోలో స్పిరిట్(Spirit )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా యానిమల్(Animal)ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)ని సెలక్ట్ చేసినట్లు సందీప్ వంగా ప్రకటించారు. స్వయంగా సందీప్ వంగా తన సోషల్ మీడియా(SM) ద్వారా స్పిరిట్‌లో త్రిప్తి డిమ్రి ఫిమేల్ లీడ్‌లో నటిస్తుందని వెల్లడించారు.
మొత్తం ఎనిమిది భాషల్లో…
అయితే త్రిప్తి డిమ్రి పేరు మొత్తం ఎనిమిది భాషల్లో కనిపిస్తోంది. భారతీయ భాషల(Indian Language’s)తో పాటు కొరియన్, చైనీస్ లాంగ్వేజెస్‌లో త్రిప్తి డిమ్రి పేరును రివీల్ చేశారు. అయితే ఈ 8 భాషల్లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ మూవీలో హీరోయిన్‌గా తనకు ఛాన్స్ ఇచ్చినందుకు త్రిప్తి డిమ్రి ఆనందం వ్యక్తం చేసింది.
యానిమల్ మూవీలో బోల్డ్ పాత్ర..
త్రిప్తి డిమ్రి సందీప్ వంగా యానిమల్ మూవీలో బోల్డ్ పాత్ర(Bold Role)లో నటించింది. ఈ సినిమాతో త్రిప్తి డిమ్రి ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమా హిట్ కావడంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్(Bollywood)లో కూడా కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో దీపికా పదుకుణే (Deepika Padukone)హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ దీపికా ప్లేస్‌లో త్రిప్తి వచ్చింది.






