TS Teacher Jobs: తెలంగాణ టీచర్ ఉద్యోగార్థులకు షాక్.. భారీగా తగ్గిన కొలువులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ (TRT) విడుదలకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కసరత్తు తది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం ఖాళీల సంఖ్యపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 5500 ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే… జులై 7న మన ఊరు-మన బడి కార్యక్రమంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మొత్తం 9370 ఉపాధ్యాయ ఖాళీలను టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) ద్వారా భర్తీ చేయాల్సి ఉందని విద్యాశాఖ ప్రతిపాదించింది.

ఐదు వేల మంది మిగులు టీచర్లను సర్దుబాటు చేసిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు 13,684 విద్యావాలంటీర్ల అవసరం ఉంటుందని పేర్కొంది. అయితే.. పూర్తి స్థాయి కసరత్తు తర్వాత 5500 నియామకాలను మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 4 వేల కొలువులకు కొత పడనుంది.

టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ లో టెట్ ఫలితాల విడుదల తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం ఏడు నుంచి ఎనిమనిది నెలల లోపు నియామక ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అనంతరం 2024-25 విద్యాసంవత్సరంలో కొత్త టీచర్లు విధుల్లోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.

Share post:

లేటెస్ట్