ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అమరావతి రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 194/7 స్కోర్ సాధించగా, తుంగభద్ర వారియర్స్ కేవలం 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ రూ.35 లక్షల నగదు బహుమతిని అందుకోగా, రన్నరప్‌గా నిలిచిన అమరావతి రాయల్స్‌కు రూ.20 లక్షలు దక్కాయి.
ఛేదనలో వారిద్దరే కొట్టేశారు..
కాగా తుంగభద్ర వారియర్స్ విజయంలో మిడిలార్డర్ బ్యాటర్లు గుట్టా రోహిత్(Gutta Rohit), సీఆర్ జ్ఞానేశ్వర్ (CR Gyaneshwar) కీలక పాత్ర పోషించారు. రోహిత్ 28 బంతుల్లో 63 (3 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు, జ్ఞానేశ్వర్ 45 బంతుల్లో 66 (8 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ చేసి జట్టును విజయతీరంలో నడిపించారు. దత్తరెడ్డి(25) కూడా కీలక ఇన్నింగ్స్‌తో రాణించాడు. అంతకుముందు అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి(51) అర్ధ సెంచరీ, రెండు వికెట్లతో పోరాడినప్పటికీ, ఫలితం రాయల్స్‌కు అనుకూలంగా రాలేదు.
ఆకట్టుకున్న టీడబ్ల్యూ కెప్టెన్ మహీప్ కుమార్ కెప్టెన్సీ
కాగా ఈ మ్యాచులో రాణించిన రోహిత్‌కు ‘Man of the Match’ అవార్డు దక్కగా.. సిరీస్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 299 రన్స్‌తో అద్భుతంగా రాణించిన విహారి(Hanuma Vihari)కి ‘Player of the Season’ అవార్డు లభించింది. కాగా క్వాలిఫయర్ 2లో భీమవరం బుల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరిన తుంగభద్ర వారియర్స్, లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి తమ సత్తా చాటింది. కెప్టెన్ మహీప్ కుమార్(Maheep Kumar) నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో APL 2025 సీజన్‌లో తుంగభద్ర వారియర్స్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అభిమానులకు మరపురాని క్షణాలను అందించింది.
👑 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 👑
Tungabhadra Warriors conquer Andhra Premier League 2025! 💛🔥
The crown is theirs, the glory is eternal! 🏆✨#APL2025 #Champions #TungabhadraWarriors #AndhraPremierLeague #AndhraCricket pic.twitter.com/Pbz0uYNOZA
— Andhra Premier League (@AndhraT20League) August 23, 2025






