
తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. నర్సింగరావును ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్(AP Intelligence and Security Wing)లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఓ కేసు(Case) విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత(AP Home Minister Anitha) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.