OTT News: ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు

ఓటీటీ ప్రియుల(OTT Lovers)కు గుడ్ న్యూస్. థియేటర్లో మిస్ అయిన సినిమాలను సమ్మర్‌లో హాయిగా ఇంట్లోనే చూసే అవకాశం వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు (మే 8) ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు రానున్నాయి. ఇందులో ఒకటి సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) నటించిన “జాక్(JACK)” చిత్రం కాగా.. మరొకటి యాంకర్, నటుడు ప్రదీప్ మాచరాజు(Pradeep Macharaju) నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkaada Ammayi Ikkaada Abbayi)’. ఈ రెండు మూవీలు గత నెలలో థియేటర్లలోకి వచ్చాయి. అయితే అనుకున్న మేర అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో OTTలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాయి.

సిద్దు ‘జాక్’కు రెస్పాన్స్ వచ్చేనా..

సిద్దు జొన్నలగడ్డ – వైష్ణవీ చైతన్య(Vaishnavi Chaitanya) ప్రధానమైన పాత్రల పోషించిన చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్(Bhaskar) దర్శకత్వంలో BVSN ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ మూవీ ‘Netflix’ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్(Poster)ను కూడా వదిలారు. రూ.30కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి, థియేటర్స్ వైపు నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.

Jack Twitter Review: Siddhu Jonnalagadda starrer Telugu film fails to  impress the audience

ప్రదీప్ మూవీ ఆకట్టుకునేనా..

ఇక ప్రదీప్ మాచరాజు(Pradeep Macharaju) హీరోగా చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkaada Ammayi Ikkaada Abbayi)’ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భరత్-నితిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, కథానాయికగా ‘దీపిక’ పరిచయమైంది. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. OTT వైపు నుంచి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి.

Telugu Times | International Telugu News

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *