రష్యా–ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఎప్పుడు ముగుస్తుందో తెలియడంలేదు. ఉక్రెయిన్‌పై (Ukraine) మరింత ఆధిపత్యం చెలాయించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా మద్ధతు కోరారు. దీంతో ఆ దేశ సైన్యం సైతం ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతోంది. అయితే ఈ దాడులను కీవ్ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోంది. ఈ పోరులో కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారని, తీవ్రంగా గాయపడుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. తాజాగా దాన్ని రుజువు చేసేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కోలేక కిమ్ జవాన్లు పరుగులు పెట్టినట్లుగా ఉంది.
దాదాపు వెయ్యి మంది కిమ్ సైనికులు హతం
కీవ్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఈ వీడియోను విడుదల చేసింది. రష్యాలోని కుర్స్క్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా (North Korea) జవాన్లను ఉక్రెయిన్ బలగాలు కమికేజ్ డ్రోన్లను వేటాడాయి. గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు వేయి మంది ఉత్తర కొరియా సైనికులు చనిపోయినట్లు సమాచారం. డ్రోన్ల దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
One Ukrainian SOF FPV crew from 8th Regiment has destroyed 77 North Koreans over a period of three days in Kursk region. pic.twitter.com/sfWEZBWXr3
— SPECIAL OPERATIONS FORCES OF UKRAINE (@SOF_UKR) December 23, 2024






