నాలుగు పదుల వయసులోనూ తన అందం, అభినయంతో ఓటీటీ ప్రపంచంలో సత్తా చాటుతున్న నటి సుర్వీన్ చావ్లా(Surveen Chawla) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్ల కన్నా ఎక్కువగా ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు విజయవంతమై ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘సేక్రెడ్ గేమ్స్, పార్చ్డ్, క్రిమినల్ జస్టిస్’ వంటి ప్రాజెక్టులతో విభిన్నమైన పాత్రలు పోషించి నటిగా మంచి ప్రశంసలు అందుకుంది.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లకు భారీ ఆదరణ లభిస్తున్న సమయంలో, సుర్వీన్ తన ఆకర్షణీయమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amezon Prime Video)లో రాబోతున్న ‘అంధేరా'( Andhera) చిత్రంలో సుర్వీన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. రాఘవ్ దర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఆగస్టు 14 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రియా బాపట్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో సుర్వీన్ పోషించిన పాత్రపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
‘అంధేరా’కు ముందు సుర్వీన్ ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టుల్లో భాగమైంది. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన ‘మాండ్లా మర్డర్స్’ సిరీస్‌లో అనన్య భరద్వాజ్ పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సంవత్సరం ‘క్రిమినల్ జస్టిస్ సీజన్ 4’లో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది.
అలాగే రానా నాయుడు సీజన్ 2లో ఆమె పాత్ర కూడా చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా ‘రంగ్‌బాజ్, సేక్రెడ్ గేమ్స్, పార్చ్డ్’ వంటి ప్రముఖ ఓటీటీ ప్రాజెక్టుల్లో కనిపించి డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. డిజిటల్ ప్రపంచంలో సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులతో ఆమె పేరు నిలుస్తుండగా, రాబోయే ‘అంధేరా’తో మళ్లీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
View this post on Instagram






