సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ సినిమా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నై(Chennai)కి చెందిన యూనో ఆక్వా కేర్(Uno Aqua Care) అనే సాఫ్ట్వేర్ సంస్థ తమ ఉద్యోగులకు రిలీజ్ రోజు (గురువారం) సెలవు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై, చెంగల్పట్టు, అరపాలయం, మట్టుతవాని శాఖల్లోని ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని సంస్థ సర్క్యులర్‌లో తెలిపింది. ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
టీజర్, పాటలు, ట్రైలర్లతో సినిమాపై హైప్
కాగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ‘కూలీ’లో నాగార్జున, శృతి హాసన్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) సంగీతం అందించిన ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలవుతోంది.

కాగా యూనో ఆక్వాకేర్ సంస్థ నిర్ణయం సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. రజినీకాంత్ అభిమానులు ‘కూలీ క్రేజ్’ మామూలుగా లేదని, ఈ సెలవు ఉద్యోగులకు సినిమాను మొదటి రోజే ఆస్వాదించే అవకాశం కల్పిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
Companies declaring holiday on the occasion of #SuperstarRajinikanth‘s movie release has become a common custom these days!
First one to start with!#Coolie pic.twitter.com/ptADrOfaVE
— Parthiban (@parthispeaks) August 9, 2025






