దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తూ మరో గూఢాచారి పోలీసులకు చిక్కాడు. పాక్ కోసం గూఢచార్యానికి (Spying for Pak) పాల్పడుతున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యాపారి షహ్‌జాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. షహ్‌జాద్ గూఢచర్యంతో (Spying) పాటు పాక్‌కు స్మగ్లింగ్ (smuggling) చేస్తున్నట్టు సమాచారం అందడంతో యూపీ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌బృదం అతడిని మొరాదాబాద్‌లో అరెస్ట్ చేసింది.
పాక్ ఏజెంట్లకు డబ్బు, భారతీయ సిమ్ కార్డులు..
గత కొంతకాలంగా షహ్‌జాద్ పలుమార్లు పాక్ వెళ్లి వచ్చాడని, స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధద్రవ్యాలు వంటివి అక్రమంగా సరిహద్దులు దాటించాడని.. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) కోసం అతడు గూఢచర్యానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తన హ్యాండ్లర్లకు పంపిస్తున్నట్టు గుర్తించామన్నారు.
Accused Shehzad smuggled goods as cover for espionage activities
Facilitated Pakistan’s Inter-Services Intelligence operations in India
Was arrested by UP Anti-Terror Squad from Moradabad district on Saturday pic.twitter.com/LeRavDDYpz
— India Brains (@indiabrains) May 19, 2025
పాక్ ఐఎస్ఐ ఏజెంట్లకు షహ్‌జాద్ డబ్బు, భారతీయ సిమ్ కార్డులను అందించేవాడని, యూపీలోని రామ్‌పూర్‌తో పాటు ఇతర జిల్లాల్లోని వారిని ఐఎస్‌ఐకి పనిచేయించేందుకు పాక్‌కు కూడా పంపించేవాడని తెలిపారు. కాగా అంతకుముందు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (jyoti malhotra) పాక్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే.






