Mana Enadu : 2024 ఏడాది ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా టాలీవుడ్ (Tollywood Movies) లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కొన్ని చిత్రాలు మధ్య నిరాశ పర్చాయి. ఇక సరికొత్త ఆశలతో 2025 సంవత్సరం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాదిలో మొదటిగా ప్రేక్షకులను పలకరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓసారి చూద్దామా..?
థియేటర్లలో సందడి చేయనున్న సినిమా ఇదే..
కొత్త ఏడాదిలో థియేటర్లలో సందడి చేయడానికి కేవలం ఒక్క సినిమా మాత్రమే వస్తోంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 (Pushpa 2) థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో న్యూ ఇయర్ కు పెద్దగా కొత్త సినిమాలేం రావడం లేదు. కానీ సంక్రాంతి సందర్భంగా వచ్చే వారం మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు రిలీజ్ కు రంగం సిద్ధం చేశాయి. ఇక ఈ వారం మాత్రం ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా హనీఫ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ (Marco). నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది.
ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్
- అవిసీ (డాక్యుమెంటరీ) డిసెంబరు 31
- డోంట్ డై (హాలీవుడ్)జనవరి 01
- మిస్సింగ్ యే (వెబ్‌సిరీస్) జనవరి 01
- రీ యూనియన్ (హాలీవుడ్) జనవరి 01
- లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్‌సిరీస్) జనవరి 01
- సెల్లింగ్ ది సిటీ (వెబ్‌సిరీస్) జనవరి 03
- వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్‌సిరీస్) జనవరి 04
అమెజాన్ ప్రైమ్
- గ్లాడియేటర్2 (హాలీవుడ్) జనవరి 01
ది రిగ్ (వెబ్‌సిరీస్)జనవరి 02- గుణ (హిందీ) జనవరి 03
ఆహా
- జొల్లీ ఓ జింఖానా (తమిళ) డిసెంబరు 30
డిస్నీ+హాట్‌స్టార్
- ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ – జనవరి 3






