UPI Payments: ఫెస్టివల్ సీజన్.. రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్!

ManaEnadu: దేశంలో డిజిటల్ చెల్లింపులు(Digital Payments) క్రమంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగం పెరిగిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్(Transactions) జోరందుకున్నాయి. సామాన్యుల నుంచి లక్షాధికారుల వరకూ ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు(Digital Transactions) కొనసాగిస్తున్నారు. బజ్జీల బండి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ ఈ తరహా బిజినెస్(Business) జరుగుతోంది. క్యాష్ క్యారీ చేయకుండా ఫోన్‌లోని పేమెంట్ యాప్‌లను ఉపయోగించి యూపీఐ(
Unified Payments Interface) ద్వారా ఈ లావాదేవీలను చాలా సులభంగా చేసేస్తున్నారు.

 వరుస పండగుల నేపథ్యంలోనే..

అయితే గత నెల లావాదేవీల్లో UPI సేవలు రికార్డు సృష్టించాయి. ఒక్క అక్టోబర్ నెలలో ఈ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 1658 కోట్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. ఈ ట్రాన్సాక్షన్ల విలువ రూ. 23.5 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా UPI ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు వృద్ధి చెందినట్లు వెల్లడించింది. ముఖ్యంగా దీపావళి, దసరా, దంతేరాస్ పండుగల నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు.

 విలువ పరంగా 34% వృద్ధి

వార్షిక ప్రాతిపదికన చూస్తే.. UPI లావాదేవీల్లో సంఖ్యా పరంగా 45% వృద్ధి కనిపించగా.. విలువ పరంగా 34% పెరిగాయి. సెప్టెంబర్ నెలలో UPI Transactions సంఖ్య 1500 కోట్లుగా నమోదైంది. కాగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో ఆ సంఖ్యను దాటేసింది. రోజువారీగా సగటు లావాదేవీలు సెప్టెంబర్ నెలలో 5 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో చూస్తే ఆ సంఖ్య 5.35 కోట్లకు చేరింది.

Related Posts

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్! ధర ఎంతంటే..?

హీరో ఎలక్ట్రిక్ సబ్సిడరీ(Hero Electric Sabsidari) అయిన విడా(Vida VX2) సంస్థ తాజాగా తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ VX2(Famely Electric Schooter)ను మార్కెట్‌లోకి విడుదల(Lanched) చేసింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు – Go మరియు Plus.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *