
విదేశీ విద్యార్థులకు అమెరికా వీసాలను నిలిపివేసింది. అమెరికా రాయబార కార్యాలయాల్లో విద్యార్థులు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై చైనా స్పందించింది. చైనా (china) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ అమెరికా చర్యలపై మాట్లాడారు. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ అమెరికా తీసుకున్న నిర్ణయంపై మాట్లాడారు.
చైనా విద్యార్థులకు షాక్..
అంతర్జాతీయ విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు కాపాడాలని అమెరికాను కోరుతున్నట్లు ప్రకటించారు. చైనా, అమెరికా మధ్య విద్యాపరమైన ఎలాంటి అడ్డంకులు కలిగించకూడదని అన్నారు. అయితే యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం సంచలన ప్రకటన చేశారు. చైనీస్ కమ్యూనిస్ట్ (china communist party) పార్టీతో సంబంధాలు ఉన్న విద్యార్థుల వీసాలను క్యాన్సల్ చేస్తున్నట్లు ముఖ్యంగా పరిశోధనా రంగాల్లో వారి వీసాలను పునరుద్ధించేది లేదని చెప్పారు.
సోషల్ మీడియా అకౌంట్లపై కన్ను
ఇక, విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా స్టూడెంట్ల వీసాలను రద్దు చేస్తాం. విదేశీ విద్యార్థులకు వీసాలు ఇవ్వాలంటే ముందుగా వారి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తాం. అమెరికాకు ఏ మాత్రం వ్యతిరేకంగా పోస్టులు ఉన్నా వారికి వీసాలు ఇచ్చేది లేదని కుండబద్ధలు కొట్టారు. ఇప్పటికే వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అప్పటివరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను (interveiw appointment) నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.