Vadde Naveen: స్టార్ హీరో రీఎంట్రీ.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’లో వన్డే నవీన్

తెలుగు సినిమా పరిశ్రమ(Telugu film industry)లో 90వ దశకంలో యూత్ స్టార్‌గా వెలుగొందిన వడ్డే నవీన్(Vadde Naveen) చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘చాలా బాగుంది’ వంటి హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నవీన్, 2016లో ‘ఎటాక్’ సినిమాలో నటించిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు(Transfer Trimurtulu)’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నారు.

ఖాకీ దుస్తుల్లో లాఠీ పట్టుకుని నవ్వుతూ..

వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌(Vadde Creations banner)పై, వడ్డే జిష్ణు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. రాశీ సింగ్(Rashi Singh) హీరోయిన్‌గా నటిస్తుండగా, రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్(Baba Master) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాఖీ పండుగ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌(First look poster)లో నవీన్ ఖాకీ దుస్తుల్లో, లాఠీ పట్టుకుని నవ్వుతూ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ సినిమాలో కామెడీ అంశాలు పుష్కలంగా ఉంటాయని సూచిస్తోంది.

80 శాతం షూటింగ్ పూర్తి

ఈ చిత్ర షూటింగ్ మే 15న ప్రారంభమై, ఇప్పటికే 80 శాతం పూర్తయింది. కార్తీక్ సుజాత సాయికుమార్ సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ నాయక్ సంగీతం, విజయ్ ముక్తావరపు ఎడిటింగ్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడైన నవీన్, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాణ రంగంలోనూ అడుగుపెడుతున్నారు. ఈ రీఎంట్రీతో నవీన్ మళ్లీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *