గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్(Vallabhaneni Vamsi )కు మరో షాక్ తగిలింది. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే తాజాగా కోర్టు వంశీకి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.
22వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు
ఈ కేసులో వల్లభనేని వంశీతో సహా ఐదుగురు నిందితులకు రిమాండ్ (Vallabhaneni Vamsi Remand) ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో వంశీ ప్రధాన అనుచరుడు రంగాపై పీటీ వారెంట్ దాఖలు చేయగా.. అతడికి కూడా ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో.. ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ తర్వాత.. వంశీపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.






