బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సిరి హనుమంతు(Siri Hanumanth). ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి పాపులర్ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింతగా గుర్తింపు తెచ్చుకున్న సిరి, అక్కడ కొంత నెగెటివ్ ఇమేజ్ వచ్చినా బయటకు వచ్చాక అవకాశాలు మాత్రం పెరిగాయి.
ఇద్దరి లోకం ఒకటే, నరసింహపురం, ఓరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా ఓ కమెరా స్పెషల్ రోల్ చేసింది. ఈ మధ్యే పులి మేక వంటి వెబ్ సిరీస్‌లతోనూ యూత్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
సిరి.. శ్రీహాన్ రిలేషన్‌షిప్ విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన శ్రీహాన్‌తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సిరి, ఇద్దరూ ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. వీరి పెళ్లిపై రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. కానీ వీరందరు అవేవి పట్టించుకోకుండా తమ జీవితాన్ని తాము కోరినట్టుగా లీడ్ చేస్తున్నారు.
ఇక తాజాగా సిరి వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham) శ్రీహాన్( Shrihan)తో కలిసి చేసింది. ఈ పూజకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిరి చీర కట్టులో అందంతో మెరిసిపోగా, శ్రీహాన్ సంప్రదాయ పంచెకట్టులో దర్శనమిచ్చాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని నెటిజన్‌ల ప్రశ్నలు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి. “పెళ్లి కాకుండానే ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram






