ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేశ్ (venkatesh) తన రానున్న సినిమాల లైనప్ చెప్పి సర్ప్రైజ్ చేశారు. అమెరికాలో జరుగుతున్న ‘నాట్స్ 2025’లో (NATS 2025) వెంకీ సందడి చేశారు. ఈ సందర్భంగా తాను చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడారు. ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో కలిసి నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో భారీ ప్రాజెక్ట్లో తన స్నేహితుడితో కలిసి యాక్ట్ చేస్తున్నట్లు చెప్పి ఆడియన్స్లో ఆసక్తి పెంచారు.
అనిల్ రావిపూడితో మరోసారి..
తనపై ఇత ప్రేమ చూపుతున్న అభిమానులకు నాట్స్ వెంకీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాను చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు. ‘‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. అలాగే చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్లో యాక్ట్ చేస్తున్నా. అది చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. అలాగే మీనాతో కలిసి ‘దృశ్యం’లో చేస్తున్నాను. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో కలిసి మరోసారి మీ ముందుకు రానున్నాను. వీటన్నింటితో పాటు మరో భారీ ప్రాజెక్ట్‌లో నా స్నేహితుడితో కలిసి నటిస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ పెద్ద స్టార్’’ అని వెంకటేశ్ చెప్పారు. అయితే ఆ పెద్ద స్టార్ ఎవరు, ఏ మూవీ అని తెలుసుకునే పనిలో పడ్డారు సినీ ప్రేమికులు.
అట్టహాసంగా నాట్స్ వేడుకలు
అమెరికాలో ‘నాట్స్ 2025’ కార్యక్రమం సందడిగా సాగుతోంది. తెలుగు సినీ ప్రముఖులు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), హీరోయిన్ శ్రీలీల (Sreeleela), టాప్ డైరెక్టర్ సుకుమార్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రేక్షకుల్లో జోష్ పెంచారు. పుష్ప డైలాగ్ ‘తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్’ చెప్పి అలరించారు.
Venky With Chiru – Balayya ❤️❤️❤️😍😍😍
Venky Babu Bangaram For a reason 🤩త్రిమూర్తులు@KChiruTweets @VenkyMama #Balayya#Chiranjeevi #Venkatesh #Balakrishna #VenkyTrivikram #Drishyam3 #VenkyAnil #VenkyBala https://t.co/CzO0zre768 pic.twitter.com/huRbwMk4yv
— VenkyMasss🔥 3Industry Hits💥💥💥 (@Thiruvictory) July 7, 2025






