‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. వెంకీ-అనిల్ హ్యాట్రిక్ కొట్టారా?

ఈ సంక్రాంతి రేసులో లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). జనవరి 14వ తేదీన ఆయన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Review)’ సినిమా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.  ఇప్పటిగే రిలీజ్ అయిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నాయి. మరి లేటుగా వచ్చిన వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టాడా..? చెర్రీ, బాలయ్యకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడా..? ఈసారి వెంకీయే సంక్రాంతి విన్నర్ అయ్యాడా? తెలియాలంటే ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే..

నటీనటులు: విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ

దర్శకత్వం: అనిల్ రావిపూడి (Anil Ravipudi)

నిర్మాత: దిల్ రాజు

సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి

ఎడిటర్: తమ్మిరాజు

మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

రిలీజ్ డేట్: 14-01-2025

రేటింగ్ : 3/5

ఇదీ సినిమా స్టోరీ 

యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) ఓ అనాథ. అయినా కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగంలో చేరి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. తన సహ ఉద్యోగి డీసీపీ మీనాక్షి (Meenakshi CHowdary)తో లవ్ లో పడతాడు. అయితే పలు కారణాలతో వారు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత రాజు భాగ్యలక్ష్మీ (Aishwarya Rajesh)ని పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్నారై ఆకెళ్ల సత్యం (అవసరాల శ్రీనివాస్)‌ను బీజూ పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అప్పటికే సస్పెండ్ అయిన రాజుకు, డీసీపీ మీనాక్షికి సత్యంను విడిపించే బాధ్యతను అప్పగిస్తారు ఉన్నతాధికారులు.

అలా మాజీ లవర్ తో కలిసి రాజు పని చేయాల్సి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భాగ్యలక్ష్మీ తాను కూడా ఈ మిషన్ లో పాల్గొంటానంటుంది. మరి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దామోదర రాజు ఎందుకు సస్పెండ్ అయ్యాడు? సత్యంను పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీనాక్షితో రాజుకు ఎందుకు బ్రేకప్ అవుతుంది? భాగ్యానికి మీనాక్షి రూపంలో సవతిపోరు ఎలాంటి సమస్యలు తెచ్చింది? మాజీ ప్రేయసి, భార్య మధ్య రాజు ఎలా నలిగాడు? సత్యం కిడ్నాప్ డ్రామా ఎలా సుఖాంతమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ ఎలా ఉంది?

సరకు పాతదే అయినా.. కొత్త సీసాలో పోసిన మందులాగా.. సినిమా స్టోరీ పాతదే అయినా.. దీనికి కమర్షియల్, కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాను జోడించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక తన బెస్ట్ స్పేస్ అయిన కామెడీని సరిగ్గా యూజ్ చేసుకుని సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఒక్కోసారి జంధ్యాల మార్క్ కామెడీతో అదరగొట్టాడనిపిస్తుంది. కాసేపటికే జబర్దస్త్ స్కిట్ మార్కు కామెడీతో కాస్త విసుగొస్తుంది. ఇక వెంకీకి ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్ ఇమేజ్ ను అనిల్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు. వాళ్ల కోసమే కొన్ని సీన్స్ రాసుకున్నాడని అనిపించినా.. కరెక్టుగా వాళ్ల పల్స్ పట్టుకున్నాడనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..? 

ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా, మాజీ ప్రియుడిగా, రెస్పాన్సిబుల్ భర్త, తండ్రిగా రాజు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. తనకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యారో మరోసారి ఈ సినిమాలో భర్త, తండ్రి, కొడుకు పాత్రలో తన నటనతో నిరూపించాడు. ఇక మాజీ లవర్, భార్య మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో తన కామెడీ టైమింగ్ తో వెంకీ అదరగొట్టేశాడు. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో రెచ్చిపోయారు. మిగతా నటులు తమ పరిధి మేరకు నటించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక ఇందులో వెంకీ స్వయంగా పాడిన పాటకు థియేటర్లలో విజిల్సే విజిల్స్. గోదారి గట్టు పాట వచ్చినప్పుడు ఆడియెన్స్ సీట్లో కూర్చుంటే ఒట్టు. బీజీఎం కూడా అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా చక్కగా కుదిరింది. మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ వేళ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది వెంకటేశ్ అండ్ టీమ్. అలా ఈ పండుగ పూట ఇంటిల్లిపాది హాయిగా జాలీగా ఎంజాయ్ చేసేలా సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టారు.

ప్లస్ పాయింట్స్

+ జంధ్యాల కామెడీ మార్క్

+ వెంకటేశ్ కామెడీ టైమింగ్

+ ఫ్యామిలీ డ్రామా

మైనస్ పాయింట్స్

–  తెలిసిన కథే కావడం

–  అక్కడక్కడా జబర్దస్త్ స్కిట్ కామెడీ

కన్ క్లూజన్ : ఈ సంక్రాంతికి వచ్చి వెంకీమామ నవ్వులు పూయించాడు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *