‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ వచ్చేసిందోచ్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ఎఫ్-2 (F2), ఎఫ్-3 (F3) సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ కు రెడీగా ఉంది.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఈ చిత్రబృందం బిజీబిజీగా ఉంది. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండులో ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో వెంకటేశ్ సహా చిత్రబృందం సందడి చేసింది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా  ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ డ్రామాగా అనిల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.

ఎక్స్ పోలీసు విత్ ఎక్స్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

ఈ సినిమా పాటలు కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రాక్స్ యూట్యూబ్, అన్ని మ్యూజిక్ చార్ట్స్‌‌లో టాప్ ట్రెండింగ్‌లో మోత మోగిస్తున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam Trailer) మూవీలో వెంకటేశ్ ఎక్స్ పోలీసుగా నటించారు. ఆయనకు భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి సందడి చేశారు. వీరితోపాటు సినిమాలో ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *