
సీనియర్ నటి బి.సరోజాదేవి (B.Saroja Devi) కన్నుమూశారు. 87 ఏళ్ల ఆమె బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి అప్పట్లో హవా సాగించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ ఇతర దిగ్గజ నటులతో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొత్తం 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీత అవార్డులు సొంతం చేసుకున్నారు.
అలా నటించిన ఏకైక హీరోయిన్..
1942 లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి (Saroja Devi) 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ‘పెళ్లిసందడి’ (1959) ఆమె మొదటి సినిమా. పాండ మహత్యం, భూకైలాస్, సీతారామ కల్యాణం, జగదేకవీరుని కథ, శ్రీకష్టార్జున యుద్ధం, దాగుడు మూతలు, దానవీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం వంటి పలు తెలుగు హిట్ మూవీల్లో నటించారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఏకైక నటిగా సరోజాదేవి చరిత్ర సృష్టించారు.
Kannada legendary actress B. Saroja Devi passes away in Bengaluru. One of the finest actress of South!
Acted in hundreds of films across Kannada, Telugu, Tamil, Malayalam and Hindi..
Om Shanti 🙏 pic.twitter.com/4XJlmfuLDr
— Shilpa (@shilpa_cn) July 14, 2025