ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship 2025) పాయింట్స్ టేబుల్(Points Table) మళ్లీ మారింది. శ్రీలంక(SL)పై తొలి టెస్టులో 233 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా(SA) రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా(AUS) మూడో ప్లేస్‌కి పడిపోయింది. మరోవైపు WTC పట్టికలో భారత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. స్వదేశంలో కివీస్(NZ)తో సిరీస్‌ను 0-3తో కోల్పోయిన భారత్.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో కంగారూలపై భారీ విజయం సాధించింది. దీంతో ఫస్ట్ ప్లేస్‌కి చేరింది.
టాప్‌లో భారత్.. లిస్ట్‌లో బంగ్లాదేశ్
కాగా ప్రస్తుతం ఈ టేబుల్‌లో టీమ్ ఇండియా(Team India) 61.11% విన్నింగ్ పర్సంటేజ్‌తో టాప్‌లో ఉండగా.. సౌతాఫ్రికా 59.26%, ఆస్ట్రేలియా 57.69%, న్యూజిలాండ్ 54.55%, శ్రీలంక 50%, ఇంగ్లండ్ 40.79%, పాకిస్థాన్ 33.33%, వెస్టిండీస్ 26.67%, బంగ్లాదేశ్ 25% PCTతో వరుసగా ఉన్నాయి. కాగా 2023-2025 సీజన్‌లో భాగంగా భారత్ మరో 4 నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్ 6న అడిలైడ్‌లో ప్రారంభం కానుంది.
పాయింట్లను ఎలా కేటాయిస్తారంటే..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) పాయింట్లను ఎలా కేటాయిస్తారంటే.. టెస్టు హోదా ఉన్న జట్లకు డబ్ల్యూటీసీలో ఆడే అవకాశం ఉంటుంది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా గెలిచిన జట్టుకు 12 పాయింట్లు, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే 4, వర్షం కారణంగా రద్దు అయితే 6 పాయింట్లు లభిస్తాయి. ఇక లీడర్ బోర్డును నిర్ణయించడానికి పాయింట్స్ పర్సంటేజ్ సిస్టమ్ (PCT)ని ఉపయోగపడుతుంది. కాగా PCT = జట్టు గెలిచిన పాయింట్లు / పోటీ చేసిన పాయింట్లు * 100తో గుణించి విన్నింగ్ పర్సంటేజ్ రేటును నిర్ణయిస్తారు.
A 🔝 victory for 🇿🇦 against Sri Lanka and they move to the second spot in the #WTC25 Table! 🙌🏻
Can #TeamIndia clinch the #PinkBallTest and stay on TOP? 👀
Watch 2nd Test 👉🏻 #AUSvINDOnStar | FRI, 6 DEC, 8 AM onwards only on Star Sports 1#WTCStandings #WTC #SLvSA pic.twitter.com/6PR4lGzvwQ
— Star Sports (@StarSportsIndia) November 30, 2024