Venkatesh: వెంకీమామ లిస్టులో మూడు సినిమాలు.. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైన్మెంట్ పక్కా!

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh).. అలియాస్ వెంకీమామ. అభిమానులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే పేరు. ఆరు పదుల వయస్సులోనూ కుర్రకారులో జోష్ నింపే వెంకీ.. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi), వెంకీ కాంబోలో వచ్చిన ఈ మూవీ వసూళ్ల పరంగానూ దుమ్మురేపింది. ఇక ఈ మూవీ వచ్చి దాదాపు 6 నెలలు పూర్తి కావొస్తోంది. దీంతో తన తర్వాత సినిమాలపై వెంకీమామ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌(Tollywood)లో వెంకీ తర్వాతి ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది.

Sankranthiki Vasthunam movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ,  వెంకీ - అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టారా... | Times Now Telugu

మెగాస్టర్ మూవీలో కీలక రోల్

వెంకటేష్ ఇప్పుడు మళ్లీ లైన్‌లోకి వచ్చేశాడు. ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారట. ఈ సినిమా కోసం ఏకంగా నెల రోజులు పాటు డేట్స్ ఇచ్చాడట వెంకీమామ. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌(Trivikram)తోనూ ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్(Pre Production Works) కూడా మొదలైపోయింది.

Venkatesh : చిరంజీవి లేకపోతే సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాడ్ని..  మెగాస్టార్‌తో సినిమా చేస్తా.. | Venkatesh comments in his 75th movie  saindhav special event-10TV ...

దృశ్యం-3 ఓకేసారి మూడు భాషల్లో..

ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్‌లో దీనిని విడుదల చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు పార్టుల్లో వచ్చి దృశ్యం(Dhrishyam) సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా దృశ్యం-3(Dhrishyam-3) సినిమాను కూడా వెంకీ మామ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఈ మూవీని రీమేక్ చేసేవారు. కానీ ఈసారి మలయాళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడానికి దృశ్యం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్ ముగ్గురు ఆయా భాషల్లో నటిస్తున్నారు. మొత్తానికి వెంకీ మామ(Venky Mama) బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Much-awaited trailer for Drushyam 2, starring Venkatesh Daggubati is OUT!

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *