Kingdom: ‘గోడమీద ఉన్న దేవుడా.. నా గుండెల్లో ఉన్న నా అన్న’.. నేడు ఫుల్ సాంగ్

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’. ఈ సినిమా తాజా అప్డేట్స్ సినీ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Director Gautham Tinnanuri) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. ఇది కథలో లాజిక్, యాక్షన్, గ్రాండియర్‌ను మరింత ఆకట్టుకునేలా చేస్తుందని తెలిపారు. ప్రమోషన్ల(Promotions)లో భాగంగా చిత్రబృందం తాజాగా “అన్న అంటూనే” అనే సాంగ్ ప్రోమో(Promo Song)ను విడుదల చేసింది.

Anna Antene Song Promo | Kingdom | Vijay Deverakonda, Satya Dev | Anirudh  Ravichander | Gowtam

రిలీజ్ డేట్ ప్రోమోకు 12 మిలియన్లకిపైగా వ్యూస్

ఇటీవల విడుదలైన రిలీజ్ డేట్ ప్రోమో(Release date promo) యూట్యూబ్‌లో 12 మిలియన్లకిపైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. అందులో విజయ్ ఫ్యూరియస్ లుక్, ఎమోషనల్ డెప్త్‌ను హైలైట్ చేసింది. ఇక తాజాగా సెకండ్ సింగిల్ ప్రోమో(Second single promo)లో “మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా.. నా గుండెల్లో ఉన్న నా అన్న” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్‌కి సత్యదేవ్(Satya Dev) అన్నగా నటిస్తున్నాడు. దీంతో బ్రదర్ సెంటిమెంట్‌ను జోడించి మేకర్స్ ప్రోమో విడుదల చేశారు. తమ్ముడి కోసం అన్న పడిన కష్టాలు, చిన్నతనంలో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎమోషనల్‌గా చూపించారు. పూర్తి సాంగ్ ఈరోజు (జులై 16) విడుదల కానుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *