Kingdom Ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కింగ్డమ్’.. రేపటి నుంచి స్ట్రీమింగ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్(Kingdom)’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. గౌతమ్‌ తిన్ననూరి(Gautham Tinnanuri) తెరకెక్కించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్‌‌ డ్రామాలో సత్యదేవ్‌(Satyadev) కీలక పాత్ర పోషించారు. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ నెల రోజులు పూర్తి కాకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో రేపటి (ఆగస్టు 27) నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.

నాలుగు వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ శక్తిమంతమైన నటన, దర్శకుడి వినూత్న కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం మిశ్రమ ఆదరణ పొందింది. ముఖ్యంగా యువ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సాధారణంగా, థియేటర్‌లో విడుదల తర్వాత సినిమాలు OTTలోకి రావడానికి 6-8 వారాల సమయం పడుతుంది. అయితే, ‘కింగ్డమ్’ కేవలం నాలుగు వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవడం విశేషం. ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో, థియేటర్లకు వెళ్లలేని ప్రేక్షకులకు ఇంటి నుంచే ‘కింగ్డమ్’ను ఆస్వాదించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *