
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్(Rukmini Vasanth), భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా..
తొలుత జులై 4న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటన
తాజాగా ‘కింగ్‌డమ్’కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాగా.. జులై 4న రిలీజ్ కాబోతున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్(release date)పై సోషల్ మీడియాలో అనేక వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘Kingdom’ రిలీజ్ డేట్‌పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని జులై 25న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక దాదాపుగా ఇదే తేదీని ఫిక్స్ చేస్తారని, త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
July 25th 💥💥#Kingdom pic.twitter.com/ZM50gELLvT
— Think Big 🌶️ (@NC34dhfm) June 18, 2025