
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా నటించిన ‘కింగ్డమ్’(Kingdom) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జులై 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను భారీగానే రాబడుతోంది. అయితే ఆయన ప్రజెంట్ రాహుల్ సంకృత్యన్(Rahul Sankruthyan) డైరెక్షన్‌లో ‘వీడీ-14’(VD 14) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్‌కు జోడిగా రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్(Mythri Movies banner)పై నవీన్ యెర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా..
పీరియాడిక్ యాక్షన్(Periodic action) డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఈ వారంలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఓ పోస్ట్(Post) నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్(Official Announcement) రావాల్సి ఉంది. కాగా వీరిద్దరు ఇదివరకు గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
#VD14 shoot begins this week!
Hero: #VijayDeverakonda
Heroine: #RashmikaMandanna
Director: Rahul Sankrityan
Music: Ajay-AtulA Historical Period Folk Noir Action Drama set in Rayalaseema during the Colonial Era🔥 pic.twitter.com/xNLyp4PgQ9
— Filmyscoops (@Filmyscoopss) August 3, 2025