
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త మూవీ కింగ్డమ్. పలు మార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని మూవీ యూనిట్ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విజయ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు. అయితే విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ (The Vijay Deverakonda) అనే ట్యాగ్‌పై గతంలో విపరీతమైన చర్చ సాగిన విషయం తెలిసిందే. ఈ ట్యాగ్పై ప్రశ్న ఎదురవడంతో విజయ్ స్పందించారు. ఆ ట్యాగ్ తనకు వద్దని, తొలగించాలని అభిమానులను కోరారు.
ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేను ఒక్కడినేనేమో..
‘‘నా పేరుకు ముందు ‘ది’ అనే ట్యాగ్‌ను జోడించడం వల్ల విపరీతంగా చర్చ జరిగింది. ఇతర హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురుదెబ్బలు నాకు నా ట్యాగ్లైన్తో తగిలాయి. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నవారు, పెద్దవారు వీటిని ఉపయోగించుకుంటున్నారు. నాకంటే ముందు ఇండస్ట్రీకి వచ్చిన వారికి కూడా ట్యాగ్‌లైన్స్ ఉన్నాయి. బహుశా ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేను ఒక్కడినేనేమో. నాకు ట్యాగ్‌లైన్‌తో గుర్తుండాలనే ఆసక్తి లేదు. ప్రేక్షకులు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటాను’ అని అన్నారు.
ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది
ఆడియన్స్ తనను సదరన్ సెన్సేషన్, రౌడీ స్టార్ ఇలాంటి పేర్లతో పిలిచారని, కానీ వాటిని తాను అంగీకరించకపోవడంతో ‘లైగర్’ ప్రచారంలో టీమ్ ‘ది’ అనే పదాన్ని జోడించిందని తెలిపారు. అప్పటివరకూ ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో తాను అంగీకరించానని, కానీ, దానివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో దాన్ని తీసేయాలని తన టీమ్‌కు సూచించినట్లు చెప్పుకొచ్చారు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని కోరారు. ఎదురయ్యే ఒడుదొడుకులను కూడా తాను సవాలుగా తీసుకొని వాటిని అధిగమిస్తానన్నారు.
🚨 🚨 #BreakingNews Vijay Deverakonda opens up on facing ‘crazy amount’ of backlash for adding ‘the’ to his name: If people don’t want it… https://t.co/b8LTNx9C4Y
Vijay Deverakonda recalled facing criticism for adding ‘The’ to his name and has now decided to drop it. #Tren…
— Instant News ™ (@InstaBharat) July 8, 2025